హైదరాబాద్: 28°C
వార్తలు

"నేతన్న నేస్తం" మోటార్ సైకిల్ ర్యాలీ వాయిదా'

సత్యసాయి: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రేపు నిర్వహించాల్సిన 'నేతన్న నేస్తం' మోటార్ సైకిల్ ర్యాలీని తాత్కాలికంగా వాయిదా వేశారు. చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లేందుకు చేపట్టిన సంతకాల సేకరణ ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. త్వరలోనే మరో రోజు ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు.