హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రముఖ కవి డేవిడ్‌కు సత్కారం

MDK: తూప్రాన్ మున్సిపాలిటీ పోతరాజుపల్లికి చెందిన ప్రముఖ కవి, గాయకుడు ముత్తిగల్ల డేవిడ్ ప్రతిష్ఠాత్మక 'తెలుగు తేజం' అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తూప్రాన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ జానకి రామ్, సెక్రటరీ జనరల్ పల్లెర్ల బాలేశ్ గుప్త పాల్గొని, డేవిడ్ సాహితీ సేవలను కొనియాడారు.