AP: భోగాపురం ఎయిర్‌పోర్టును మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సందర్శించి మాట్లాడారు. 'ఆంధ్రప్రదేశ్ భాగ్యనగరంగా ఉత్తరాంధ్ర విరాజిల్లుతుంది. అద్భుత విమానాశ్రయాల్లో ఒకటిగా భోగాపురం ఖ్యాతి గడిస్తుంది. చిరస్థాయిగా గుర్తుండేలా విమానాశ్రయం ప్రారంభమవుతుంది. అల్లూరి పేరిట విమానాశ్రయం నామకరణం శుభపరిణామం. ఎయిర్‌పోర్టు రావడంతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారుతాయని' మంత్రి కొండపల్లి తెలిపారు.
వార్తలు
భాగ్యనగరంగా ఉత్తరాంధ్ర విరాజిల్లుతుంది: కొండపల్లి


