AP: జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ సింధును అభినందించారు. 'భారత బ్యాడ్మింటన్ చరిత్రలో పీవీ సింధు రికార్డు నెలకొల్పారు. సింధు దూకుడు ముందు యమగూచి ఏ దశలోనూ నిలవలేకపోయారు. పీవీ సింధు జోరు ఇలాగే కొనసాగాలి. సింధు విజయపరంపరపై దేశమంతా గర్విస్తోంది' అని కొనియాడారు.
వార్తలు
పీవీ సింధు రికార్డు.. దేశం గర్విస్తోంది: లోకేష్


