ASR: ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ సాధ్యమని కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం రాజేంద్రపాలెం వారపు సంతలో ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. రాష్ట్రంలో జరిగిన వాస్తవ ఘటనలను కేస్ స్టడీగా వివరిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలన్నారు. గంజాయి సాగు లేదా అక్రమ రవాణాపై వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు.
వార్తలు
'ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ'


