ADB: గాదిగూడ మండలంలోని బొడ్డిగూడ, ఖడ్డోడి గ్రామాల్లో ఆదివారం ఆదివాసీలు ఆకాడి పండుగను అంగరంగవైభవంగా జరుపుకున్నారు. సంప్రదాయ ఆచారాలను పాటిస్తూ అడవి దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ ఆడ జంగు, పర్చకి హన్మంతరావు, సూర్యారావు, చందు, నాగోరావ్, దుంది పాల్గొన్నారు.
వార్తలు
గాదిగూడలో ఆకాడి పండుగ వేడుకలు


