హైదరాబాద్: 28°C
వార్తలు

జమ్మూకాశ్మీర్ వరదలు.. స్పందించిన అమిత్ షా

జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌, రాజౌరి ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ LG, సీఎంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. రాజౌరీ జిల్లాలో భారీ వర్షాలు, వరదలపై ఆరా తీశారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజల భద్రతకు కేంద్రం సహకరిస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు.