హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: హాస్టల్ మెస్‌లోకి దూసుకొచ్చిన మొసలి

రాజస్థాన్‌లోని కోటా బోర్‌ఖేడా కోరల్ పార్క్ ప్రాంతంలోని ఓ బాయ్స్ హాస్టల్ మెస్‌లోకి సుమారు 4 అడుగుల మగరం(మొసలి) ప్రవేశించి కలకలం రేపింది. భోజనం సిద్ధం చేస్తున్న ఉద్యోగి మొసలిని గమనించి భయంతో బయటకు పరుగెత్తాడు. సమాచారం అందుకున్న వన్యప్రాణి శాఖ అధికారులు దాన్ని పట్టుకుని చంబల్ నదిలో విడిచిపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.