WGL: వర్ధన్నపేట పట్టణంలోని 7వ డివిజన్ కోనాపురంలో చేపట్టిన శానిటైజేషన్ పనులను మునిసిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగించాలని, దోమల నివారణ చర్యలను మరింత ముమ్మరం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.
వార్తలు
శానిటైజేషన్ పనులను పరిశీలించిన ఛైర్మన్ సారంగపాణి


