ASF: సిర్పూర్ టీ మండల కేంద్రం నుంచి లారీలు నడిపించవద్దంటు ప్రజలు నిరసన తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రధాన రహదారిపై బైఠాయించి లారీలను అడ్డుకొని రాస్తారోకో నిర్వహించారు. లారీలు ఈ రహదారి గుండా వెళ్లడంతో రహదారి పాడై, శబ్ద కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోయారు. వెంటనే ఆర్టీవో స్పందించి లారీల రవాణా నిలిపివేయాలన్నారు.
వార్తలు
సిర్పూర్ నుంచి లారీల రవాణా నిలిపివేయాలని రాస్తారోకో


