హైదరాబాద్: 28°C
వార్తలు

సిద్ధవటంలో లారీలో డీజిల్ చోరీ!

KDP: సిద్ధవటం మండలం మాధవరం సమీపంలో నిలిపి ఉంచిన లారీలో సుమారు 390 లీటర్ల డీజిల్ చోరీ జరిగింది. ట్యాంక్ పగులగొట్టి రూ.40 వేల విలువైన డీజిల్‌ను దుండగులు అపహరించినట్లు లారీ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 100 డయల్ సమాచారం మేరకు ఎస్సై హారిక ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, పలు అనుమానిత ప్రాంతాల్లో విచారణ చేపట్టారు.