హైదరాబాద్: 28°C
వార్తలు

అఖిలపక్ష భేటీ.. విపక్ష పార్టీల వాకౌట్‌

రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అన్ని పార్టీలను కోరింది. అయితే.. ఈ భేటీ నుంచి విపక్ష పార్టీలు వాకౌట్ చేశాయి. టీఎంసీ రెబల్ ఎంపీలను అఖిలపక్షానికి ఆహ్వానించడాన్ని నిరసిస్తూ ఇండి కూటమి ఈ సమావేశాన్ని బహిష్కరించింది.