హైదరాబాద్: 28°C
వార్తలు

బద్ది పోచమ్మ అమ్మవారి సేవలో ప్రభుత్వ విప్

SRCL: వేములవాడ పట్టణంలోని బద్ది పోచమ్మ అమ్మవారిని స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆదే శ్రీనివాస్ ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన బోనాల మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆయన అమ్మవారిని వేడుకున్నారు.