హైదరాబాద్: 28°C
వార్తలు

యాదవ మిత్రమండలి మహాలక్ష్మి అమ్మవారి బోనాలు

NRML: యాదవ మిత్రమండలి నిర్మల్ ఆధ్వర్యంలో ఆదివారం సంప్రదాయ పద్ధతుల్లో బోనాల శోభాయాత్రను వైభవంగా చేపట్టారు.మహిళలు భక్తిశ్రద్ధలతో పిండి వంటకాలు తయారు చేసి,బోనాలతో శోభాయాత్రలో తరలివచ్చారు. ఏటా మిత్రమండలి ఆధ్వర్యంలో మహాలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు.