హైదరాబాద్: 28°C
వార్తలు

విశాఖ ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి

AP: విశాఖలోని ఆనందపురం-పెందుర్తి హైవేపై రోడ్డుప్రమాదంలో నలుగురు మృతిచెందారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రుడు చంద్రశేఖర్‌కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.