హైదరాబాద్: 28°C
వార్తలు

పోడు భూముల ఘటనపై మంత్రి సీతక్క సీరియస్

MLG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మనుబోతులగూడెంలో పోడు భూముల వివాదానికి సంబంధించి చోటుచేసుకున్న ఘటనపై మంత్రి డా. దనసరి అనసూయ (సీతక్క) తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీతో మంత్రి ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అలాగే అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో కూడా చర్చించారు.