హైదరాబాద్: 28°C
వార్తలు

మెరుపు వరదలు.. నలుగురు మృతి

జమ్మూకాశ్మీర్‌లో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. వరదల్లో కొట్టుకుపోయి నలుగురు మృతిచెందారు. మరో 12 మందికి పైగా గల్లంతయ్యారు. పూంచ్ జిల్లా సూరన్‌కోట్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, జమ్మూకాశ్మీర్‌లో రానున్న పది రోజులపాటు అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది. అకస్మాత్తుగా వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరించింది.