TG: హైదరాబాద్ పోలీసులు వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఓ వీడియోలో రోడ్డు పక్కన ఉన్న ఓ గుంతను దాటేందుకు ఇబ్బంది పడుతున్న బాతు పిల్లలను గమనించిన బుజ్జి కుక్క గుంతలోకి దిగి మరి వాటికి సాయం చేసింది. ఈ హృదయాన్ని హత్తుకునే వీడియోను SM వేదికగా షేర్ చేస్తూ .. 'ఎవరైనా అవసరంలో ఉన్నట్లు మీరు చూసినప్పుడు.. వెంటనే సాయం చేయండి. అత్యవసర సేవలను సంప్రదించండి' అని సూచించారు.
వార్తలు
హృదయాన్ని హత్తుకునే వీడియో❤️


