హైదరాబాద్: 28°C
వార్తలు

జోరుగా కాకినాడలో చేపల విక్రయాలు

KKD: మేక మాంసం, కోడి మాంసం ధరలు విపరీతంగా పెరగడంతో చేపలకు డిమాండ్ పెరిగింది. కాకినాడ నగరంలో చేపలు కొనుగోలుకు ప్రజల పోటెత్తారు. కాకినాడ డైరీ ఫారం చేపల మార్కెట్ కొనుగోలుదారులతో నిండిపోయింది. శీలావతి, బొచ్చే, బంగారుపాపలు, ఎర్ర మేను, గులివెందులు, కానాగడతలు, చెరువు సందువా వంటి చేపలు విక్రయాలు జోరుగా కొనసాగాయి. ఆదివారం కావడంతో చేపల ధరలు కూడా అధికంగానే ఉన్నాయి.