MNCL: వేమనపల్లి మండలం క్యాతనపల్లి గ్రామపరిధిలోని పోచమ్మవాడలో కొద్దిపాటి వర్షానికే రహదారి బురదమయంగా మారింది. రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో పాదచారులు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం నడవలేని స్థితిలో రోడ్డు తయారైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని కోరారు
వార్తలు
క్యాతనపల్లిలో బురద రోడ్డుతో ప్రజల నరకయాతన


