హైదరాబాద్: 28°C
వార్తలు

రెబ్బెనలో 29.8 మి.మీ వర్షపాతం నమోదు

ASF: ఆసిఫాబాద్ జిల్లాలో గత 24 గంటల్లో పలుచోట్ల మోస్తరు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రెబ్బెన మండలంలో 29.8 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. తీర్యాణిలో 25.5 మి.మీ, లింగాపూర్‌లో 13.8 మి.మీ, కాగజ్‌నగర్‌లో 5.5 మి.మీ వర్షపాతం నమోదైంది. దహెగాంలో 3.0 మి.మీ, సిర్పూర్(టి), వాంకిడి, కౌటాల మండలాల్లో ఒక్కోచోట 1.5 మి.మీ చొప్పున వర్షం కురిసింది.