హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: తీవ్రమైన కోతుల బెడద.. ఆందోళనలో ప్రజలు

NLG: చిట్యాలలో కోతుల బెడద తీవ్రంగా మారింది. ఉదయాన్నే గుంపులుగా వీధుల్లోకి వస్తున్న కోతులు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మనుషులపైకి ఎగబడుతుండటంతో మహిళలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని 6వ వార్డు వాసి యశ్వంత్ ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, కోతుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరారు.