హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీసు శాఖ ప్రతిష్ఠను పెంచాలి: ఎస్పీ

KMR: జిల్లాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన SHO అనిల్, ఆంజనేయులు, విజయ్ కొండ, నవీన్ చంద్ర, ఎస్సై శిరీష నిన్న సాయంత్రం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ వారికి అభినందనలు తెలుపుతూ.. పోలీసు శాఖ ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్నారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ఉంటూ, సమస్యలను సత్వరమే పరిష్కరించలన్నారు.