హైదరాబాద్: 28°C
వార్తలు

శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ డిమాండ్

కర్నూలు జిల్లా అభివృద్ధి, నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై మంత్రి టీజీ భరత్ ఒక నెలలోగా శ్వేతపత్రం విడుదల చేయాలని డీసీసీ అధ్యక్షుడు క్రాంతి నాయుడు డిమాండ్ చేశారు. రైతులు, యువత, నిరుద్యోగులు, రాయలసీమ అభివృద్ధిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. శ్వేతపత్రం విడుదల చేయకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రి టీజీ భరత్‌ను ఘెరావ్ చేస్తామని హెచ్చరించారు.