హైదరాబాద్: 28°C
వార్తలు

యూపీఎస్సీ ఉచిత కోచింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం

BDK: తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2027ఉచిత దీర్ఘకాలిక కోచింగ్‌కు అర్హులైన డిగ్రీ ఉత్తీర్ణుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ఈనెల 17నుంచి ఆగస్టు 7 వరకు కొనసాగుతుందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు స్టైపెండ్, పుస్తక, గ్రంథాలయ సౌకర్యం ఉంటుందన్నారు.