హైదరాబాద్: 28°C
వార్తలు

న్యాయ సేవలపై విద్యార్థులకు అవగాహన

పెద్దపల్లి: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పెద్దపల్లి గర్ల్స్ జూనియర్ కాలేజీలో శనివారం న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎవరికైనా సమస్య ఎదురైతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు, 15100 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. పోక్సో చట్టం ప్రాధాన్యత, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించారు.