హైదరాబాద్: 28°C
వార్తలు

'నీటి సరఫరాలో అంతరాయం ఉండొద్దు'

కోనసీమ: ఖరీఫ్ సీజన్‌లో రైతులకు సకాలంలో సాగునీరు, ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ శనివారం ఆదేశించారు. కాలువలు, డ్రైన్ల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే బిల్లులు మంజూరు చేయాలని సూచించారు.