హైదరాబాద్: 28°C
వార్తలు

వానరానికి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు

KNR: వీణవంక మండలం కోర్కల్ గ్రామంలో విద్యుత్ షాక్‌తో మృతి చెందిన వానరానికి సర్పంచ్ పూదరి రమ్యకృష్ణ గ్రామస్తులతో కలిసి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. హనుమంతుడి ప్రతిరూపంగా భావించే వానరానికి భక్తిశ్రద్ధలతో నివాళులర్పించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ ఘటన గ్రామంలో మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది.