KNR: గంగాధర మండలం ఒద్యారం గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. క్లస్టర్ ఏఈఓ గోపీచంద్ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
వార్తలు
వర్షాభావంపై రైతులకు సూచనలు


