హైదరాబాద్: 28°C
వార్తలు

భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు

భారత విమానాలు తమ భూభాగంలోకి ప్రవేశించకుండా గగనతల ఆంక్షలను పాక్ ప్రభుత్వం మరోసారి పెంచింది. గతంలో ఉన్న ఆంక్షలు జూలై 24తో ముగియాల్సి ఉండగా, దానిని మరో నెల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆగస్టు 23వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరు దేశాలు ఒకరిపై మరొకరు గగనతల ఆంక్షలు విధించుకున్నాయి.