హైదరాబాద్: 28°C
వార్తలు

చెన్నమ్మ మరణవార్త తీవ్రంగా కలిచివేసింది: సీఎం

AP: మాజీ ప్రధాని దేవెగౌడ సతీమణి చెన్నమ్మ మరణవార్త తీవ్రంగా కలిచివేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. చెన్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా దేవెగౌడ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ శోక సమయంలో మాజీ ప్రధాని కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని భగవంతుడిని కోరారు.