హైదరాబాద్: 28°C
వార్తలు

చర్చి నిర్మాణానికి ఎమ్మెల్యే హామీ

PLD: మాచవరం (మం) మల్లవోలు పర్యటనలో గుర్రజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. 2024 ఎన్నికల హామీని గుర్తుచేస్తూ.. గ్రామంలో చర్చి నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభించి 2027 క్రిస్మస్ లోపు పూర్తి చేస్తానని ప్రకటించారు. అడగకుండానే హామీని నెరవేరుస్తానన్న ఎమ్మెల్యే చొరవపై చర్చి పెద్దలు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.