బాపట్ల పట్టణంలో శ్రీ జగన్నాథ స్వామివారి దివ్య రథయాత్ర శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇస్కాన్ చీరాల, బాపట్ల సంయుక్తంగా ఈ మహోత్సవాన్ని నిర్వహించాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని రథాన్ని లాగారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పట్టణ పురవీధుల్లో రథయాత్ర కన్నులపండువగా సాగి భక్తులను ఆకట్టుకుంది.
వార్తలు
బాపట్లలో వైభవంగా జగన్నాథ రథయాత్ర


