హైదరాబాద్: 28°C
వార్తలు

40 ఏళ్లుగా మేరీనగర్‌కు అభివృద్ధి ఎక్కడ? : ప్రజా సంఘాలు

KDP: నగరంలోని 16వ డివిజన్ మేరీనగర్‌లో ప్రజాసంఘాల నాయకులు శనివారం సామాజిక శంఖారావం అధ్యయన యాత్ర నిర్వహించారు. కాలనీలో డ్రైనేజీ, వర్షపు నీటి నిల్వ, వీధిలైట్లు, దోమలు, పందుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. 40 ఏళ్లుగా మేరీనగర్ అభివృద్ధిని అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. SC,STసబ్‌ప్లాన్ నిధులను దళితవాడల అభివృద్ధికి వినియోగించాలన్నారు.