హైదరాబాద్: 28°C
వార్తలు

డెంగ్యూ వ్యాధి నివారణకు అవగాహన

PLD: రొంపిచర్ల (మం) సుబ్బారెడ్డి కాలనీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డెంగ్యూ సహా సీజనల్ వ్యాధుల నివారణపై వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, టైర్లు, తొట్టెలు తదితర వాటిలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దోమల నివారణ చర్యలు పాటిస్తూ.. రాత్రి వేళల్లో దోమతెరలు వినియోగించాలని సూచించారు.