హైదరాబాద్: 28°C
వార్తలు

SIRను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

KMM: కొణిజర్ల మండలం అమ్మపాలెంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి ఇవాళ పరిశీలించారు. ఓటరు నమోదు, సవరణల ప్రక్రియపై అధికారులు, పార్టీ బీఎల్‌ఏలను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల సంఖ్య, దరఖాస్తుల పంపిణీ, ఆన్‌లైన్ నమోదు పురోగతిపై వివరాలు సేకరించారు.