హైదరాబాద్: 28°C
వార్తలు

17 నుంచి అమరావతి క్రీడా పోటీలు

KRNL: ఈ నెల 17 నుంచి 25 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అమరావతి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈవో సుధాకర్, డీఎన్‌డీవో భూపతిరావు తెలిపారు. కర్నూలు అవుట్‌డోర్ స్టేడియంలో జరిగిన సమావేశంలో 12 క్రీడాంశాల్లో బాలబాలికలకు పోటీలు నిర్వహిస్తామని వివరించారు. పోటీలను విజయవంతం చేసేందుకు క్రీడా సంఘాలు, పీఈటీలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.