హైదరాబాద్: 28°C
వార్తలు

689 మంది విద్యార్థులకు ఉచిత నేత్ర పరీక్షలు

SKLM: బూర్జ మండలంలోని వీవో పేట ఆదర్శ పాఠశాలలో శనివారం విద్యార్థులకు ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించారు. PHC నేత్ర వైద్యాధికారి ఎం.బాబురావు ఆధ్వర్యంలో 689 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. ఇందులో 65 మంది విద్యార్థులకు దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించారు. వీరికి ఉచితంగా మందులు అందించారు. విద్యార్థులు ఫోన్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు.