వికారాబాద్ జిల్లాలో మదనపల్లి, కోటిపల్లి, బంటారం తదితర ప్రాంతాల రోడ్ల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటనలో సీపీఎం రైతు సంఘాల నేతలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, వందల కోట్లతో శంకుస్థాపనలు చేసి వదిలేసిన పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
మంత్రి పర్యటనలో డిమాండ్లు.. నేతల అరెస్ట్


