హైదరాబాద్: 28°C
వార్తలు

'బకాయిలను వెంటనే విడుదల చేయాలి'

KNR:పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసి, జీవో-9ను వెంటనే రద్దు చేయాలని బీసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. కరీంనగర్‌లో గీతాభవన్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టింది. జిల్లా అధ్యక్షుడు అనిల్ యాదవ్ మాట్లాడుతూ, విద్యార్థులపై ఫీజుల భారం మోపొద్దని, బకాయిలు చెల్లించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.