హైదరాబాద్: 28°C
వార్తలు

ఒకే ఇంట్లో ముగ్గురు NEET విజేతలు

బిహార్‌లోని సహస్రా ప్రాంతానికి చెందిన సాక్షి, ఆమె సోదరులు రజ్నీశ్‌, ప్రహ్లాద్‌ కుమార్‌ ఒకేసారి నీట్ పరీక్ష రాసి, మెరుగైన ర్యాంకులతో ఉత్తీర్ణులై అరుదైన ఘనత సాధించారు. స్థానికంగా కిరాణా దుకాణం నడుపుతూనే తండ్రి వారిని చదివించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, పట్టుదలతో శ్రమించి ఈ తోబుట్టువులు ఒకేసారి వైద్య సీట్లు సాధించడం విశేషం.