హైదరాబాద్: 28°C
వార్తలు

ఖైదీల సదుపాలయాలపై సివిల్ జడ్జీ ఆరా

ELR: చింతలపూడి మండల న్యాయ సేవా కమిటీ ఛైర్మన్ జూనియర్ సివిల్ జడ్జి ఏబి అప్పారావు శనివారం స్థానిక ఉపకారాగారాన్ని సందర్శించారు. జైలులోని వంటశాల, స్టోర్ రూములను తనిఖీ చేసి ఖైదీలకు అందుతున్న ఆహారం, మంచినీటి సౌకర్యాలు, వైద్య సదుపాయాలపై జైలు సూపరింటెండెంట్ కృపానందాన్ని అడిగి తెలుసుకున్నారు. నిందితులకు అందుతున్న ఉచిత న్యాయ సలహాలు, సేవలపై ఆరా తీశారు.