రక్తపోటు హెచ్చుతగ్గుల కారణంగా పట్నా ఐజీఐఎమ్ఎస్‌లో చేరిన రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కోలుకోవడంతో డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, తదుపరి వైద్య పరీక్షల కోసం దిల్లీ ఎయిమ్స్‌కు తరలించనున్నట్లు ఆయన కుమార్తె, ఎంపీ మిసా భారతి తెలిపారు. 2022లో ఆయనకు సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది.
వార్తలు
దిల్లీ ఎయిమ్స్‌కు లాలూ ప్రసాద్ యాదవ్


