KMR: బీర్కూరు మండల కేంద్రంలోని జోడి లింగాల ఆలయం వద్ద వారాహి మాత నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు మాలధారణ చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ప్రార్థిస్తూ భక్తిశ్రద్ధలతో ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.
వార్తలు
వైభవంగా వారాహి మాత ఉత్సవాలు


