హైదరాబాద్: 28°C
వార్తలు

రైలులో వేధింపులు.. యువతి ఏం చేసిందంటే?

భూసావళ్-వర్ధా ప్యాసింజర్ రైలులో ఓ యువతితో యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే, ఆ వ్యక్తిని ఆమె ధైర్యంగా అడ్డుకుని, తోటి ప్రయాణికుల సాయంతో పట్టుకుంది. అనంతరం ప్రయాణికులు అతని చేతులకు గాజులు తొడిగించి, పెదవులకు లిప్‌స్టిక్ పూసి తీవ్రంగా హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.