హైదరాబాద్: 28°C
వార్తలు

కార్యకర్తలే పార్టీకి బలం: ఎమ్మెల్యే

SKLM: పాతపట్నం టీడీపీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో క్యాడర్ సమావేశం జరిగింది. కార్యకర్తలే పార్టీకి బలమని, కష్టపడిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఇస్తామని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.