హైదరాబాద్: 28°C
వార్తలు

రేషన్ కార్డు e-KYC.. 31 వరకే గడువు 

TG: రేషన్ కార్డు లబ్దిదారులకు పౌర సరఫరాల శాఖ కీలక సూచనలు చేసింది. ఉచితంగా e-KYC చేసుకునే గడువు ఈనెల 31తో ముగుస్తుందని తెలిపింది. రేషన్ కార్డు, సభ్యుల ఆధార్ కార్డులు తీసుకెళ్లి డీలర్/మీ సేవలో e-KYC చేయించుకోవచ్చు. e-KYC లేకపోతే రేషన్ పంపిణీలో ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారముందని వెల్లడించింది. నకిలీ కార్డుల ఏరివేతలో భాగంగా పౌరసరఫరాల శాఖ దీన్ని తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.