హైదరాబాద్: 28°C
వార్తలు

బొగత జలపాతం వద్ద ఇదీ పరిస్థితి..!

ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం రోజురోజుకు తగ్గుముఖం పడుతుంది. వర్షాలు లేకపోవడంతో జల ధారలు సన్నగా కేవలం 3 చోట్ల నుంచే జాలు వారుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులు జలపాతం వద్ద జలసవ్వడి లేక నిరాశ చెందుతున్నారు. బొగత సమీపంలో నిర్మించిన స్విమ్మింగ్ పూల్లో ఈతలు కొడుతూ సరదాగా గడుపుతున్నారు.