హైదరాబాద్: 28°C
వార్తలు

డిప్యూటీ సీఎం రేపటి పర్యటన వివరాలు

BDK: రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రేపు ఇల్లందు, టేకులపల్లి మండలంలో పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నేడు ప్రకటించారు. ముందుగా ఇల్లందు మండలం రాంపేడ్ గ్రామంలో విద్యుత్ ఉప కేంద్రాన్ని శంకుస్థాపన చేస్తారని అన్నారు. అనంతరం టేకులపల్లి మండలంలో విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభిస్తారని, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని అన్నారు.