హైదరాబాద్: 28°C
వార్తలు

నకిలీ భూ దస్త్రాల కుంభకోణంలో అధికారిపై వేటు

BDK: దమ్మపేట ఏజెన్సీ నకిలీ భూ దస్త్రాల కుంభకోణంలో జిల్లా కలెక్టర్ తొలి వేటు వేశారు. అక్రమాలకు పాల్పడిన పెద్దగొల్లగూడెం జీపీవో అనంతమ్మను సస్పెండ్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే వ్యవహారంలో కుమ్మక్కైన తహసీల్దార్ రామ్ నరేష్ పైనా క్రమశిక్షణా చర్యలకు కలెక్టర్ ఆదేశించడంతో రెవెన్యూ వర్గాల్లో నేడు తీవ్ర కలకలం రేగుతోంది.